నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద రాస్తారోకోను బుధవారం విద్యార్థులు చేపట్టారు. నల్లగొండ కాలేజీలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 6:00 నుంచి 11 గంటల వరకు ఎటువంటి బస్సులు లేకపోవడంతో క్లాసులు మిస్ అవుతున్నామని ఆందోళన చేపట్టారు వెంటనే ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించి విద్యాలయాలకు వెళ్లేందుకు సరైన సమయానికి బస్సులను కేటాయించాలన్నారు. బస్సు లేక సమయానికి రాక కళాశాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని పరీక్షలు సమయానికి రాయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.