నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. హెచ్ఎం ఉమా శంకర్ మాట్లాడుతూ, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఉద్యోగాలు వెతుక్కునే వారి నుండి ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిమ్మకాయలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి, వాటిని అమ్మడం ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.