శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం హొన్నంపల్లి గ్రామ శివారులో చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. గమనించిన స్థానికులు హిందూపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు యుగంధర్కు సమాచారం ఇచ్చారు. పరిగి SI రంగడు ఆధ్వర్యంలో ఆయన మృతదేహాన్ని సోమవారం సాయంత్రం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యుల కోసం గాలించినా ఎవరు రాకపోవడంతో యుగంధర్ దగ్గరుండి అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు.