జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) గా లోచర్ల రమేష్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సహాయ సంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన రమేష్ ను గుంటూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా నియమిస్తూ సమాచార శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్యామ్ కుమార్ నుండి బాధ్యతలు స్వీకరించారు. 1996 సంవత్సరంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సహాయ పౌర సంబంధాల అధికారిగా ఎంపికై హైదరాబాద్, విశాఖపట్నం, పాడేరు, టెక్కలి, శ్రీకాకుళం, పార్వతీపురంలో పనిచేశారు.