మానవులందరూ సమానమేనని , ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టిలో గురువారం విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుహాసిని మహిళా పాదపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కులాలన్నీ ఒక్కటేనని చెబుతూ ఇన్నాళ్లు వెలివేయబడ్డ దళిత గిరిజనులకు నమ్మకం కలిగించేందుకు పాదపూజ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఊరవతల వెలివేయబడిన దళిత కాలనీలు, అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కుల వివక్షకు గురయ్యారని తెలిపారు.