ప్రకాశం జిల్లా దర్శి పట్టణం మీదుగా హైదరాబాదు ప్యాసింజర్ ట్రైన్లను నడుపుతున్నట్లుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన రైల్వే ఉన్నత అధికారులతో సమావేశం ఉందని అందులో నిర్ణయం చేయడం జరుగుతుందని అన్నారు. త్వరలో నడికుడి కాళహస్తి కి రైలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.