బాపట్ల జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా కత్తి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. శుక్రవారం బాపట్లలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఆయనకు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కత్తి శ్రీనివాసరావు బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.