సుగాలి ప్రీతి కేసును ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కర్నూలులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ...14 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైన దారుణ ఘటన తర్వాత మూడవ రోజు నుంచే మహిళ ఐక్యవేదిక జేఏసీగా ఏర్పడి నిరంతరం ఉద్యమం సాగించిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, విద్యాసంస్థల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన విషయాన్ని వెల్లడించారు. నిందితులను అరెస్టు చేయకపోతే కూర్చోలేదని, చివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పా