భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సెప్టెంబర్ 15వ తేదీన CITU ఆధ్వర్యంలో రాష్ట్ర లేబర్ కమిషన్ ఆఫీస్ మొట్టడిస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పుట్టపర్తిలోని CPM కార్యాలయంలో ఆయన BCW నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. 15న చేపట్టే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.