సురుటుపల్లిలో దరఖాస్తుల పరిశీలన సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వరస్వామి దేవస్థానం నూతన పాలకమండలి కోసం 104 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి పర్య వేక్షణలో దరఖాస్తుల పరిశీలన ఆలయ కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి జరుగుతోంది. సురుటుపల్లిలో 98 మంది, జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయంలో 6మంది దరఖాస్తులు చేసుకున్నారు.