ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు శివాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ ఊరేగింపులో పోలీసులు, భక్తులు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుల్లో బాణసంచా పేలుళ్లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బాణసంచా ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో శివాలయం యూత్ ఆందోళనకు దిగింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్ నిలిచిపోయింది.