కాలువలో పడి వ్యక్తి మృతి, కేసు నమోదు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. బిచ్కుంద కు చెందిన శక్కర్గ లక్ష్మణ్ (37) ఈనెల 28న మార్కేట్ లో పని ముగించుకొని మద్యం మత్తులో ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడీ ఊపిరి ఆడక మృతి చెందాడు. శుక్రవారం కాలువలో మృతదేహం లభ్యమవ్వడంతో మృతుడు సోదరుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.