సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ రిజర్వాయర్లోకి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేశారు. నీరు వస్తున్న నేపథ్యంలో గంగమ్మ తల్లికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూజలుచేశారు. రుద్రంగి, కథలాపూర్ చెరువులు కూడా నింపుతామన్నారు.