ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా చెత్తాచెదారాలు వ్యర్ధాలు పేరుకుపోయాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల వరకు సముద్ర తీరాన్ని అధికారులు శుభ్రం చేయించారు. వ్యర్ధాలను తొలగించి ప్రాంతాలను శుభ్రం చేసినట్లుగా అధికారులు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా సముద్ర తీరంలో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత పూలు వ్యర్థ పదార్థాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి గాలికి సముద్రతీరం మొత్తం పడినట్లుగా అధికారులు గుర్తించారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో అధికారులు సముద్ర తీరాన్ని శుభ్రం చేయించారు.