అరకు పార్లమెంట్ పరిధిలో కమిటీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం అరకులో జరిగినట్లు అరకు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కిడారి శ్రావణ్ కుమార్ తో పాటుగా మహిళ & శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షత వహించారు.విజయనగరం జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, అరకులోయ ఇంచార్జ్ సియ్యారీ దోన్ను దొర, రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి , పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి, పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్ పడాల భూదేవి సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు.