ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శిరిడి సాయిబాబా మందిరం నందు విఘ్నేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలువురికి వినాయక విగ్రహాలను అందజేశారు. ప్రతి సంవత్సరం పట్టణంలోని పలు ప్రాంతాలలో వినాయక మండపాలనందు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా విజ్ఞేశ్వర సేవా సంఘం నియమాల ప్రకారం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనం చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.