పంగులూరు మండలం నార్నే వారి పాలెం ఫ్లై ఓవర్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి వైజాగ్ వెళుతున్న హైటెక్ బస్సును లారీ ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. హైవే పోలీసులు డ్రైవర్ ను మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.