జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో పిల్లలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం ఆయా హాస్టల్లకు నియమించిన ప్రత్యేక అధికారులు శ్రద్ధ వహిస్తూ, సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయంతో పాటు బీసీ హాస్టల్ తదితర హాస్టల్లలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నిర్వహణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ గావించారు. జిల్లా కేంద్రంలోని ఆనందనిలయంలో మెప్మా అధికారి శ్రీనివాస్ గౌడ్....