మాదకద్రవ్యాలతో భవిష్యత్ నాశనం గంజాయి సహా మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందని ఈగల్ టీం ప్రసాద్, మనోహర్ తెలిపారు. పాణ్యం మండలంలోని జడ్పీ హైస్కూల్లో బుధవారం వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.