సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలోని అమృత గుండంలో బండరాయి నుండి నీరు ఉబికి వస్తుంది. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి అమృతగుండం నిండు కుండల మారింది. శనివారం మధ్యాహ్నానికి గుండంలో నీరు తగ్గినప్పటికీ బండరాయి నుండి గంగమ్మ ఉప్పొంగుతూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.