శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు జేమ్స్ ఆస్పత్రి నుంచి గూడెం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న పొదల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి భయాందోళన చెందారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై మృతదేహాన్ని పరిశీలించారు. కాగ మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని పడేశారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.