బ్లాక్ లో యూరియాను నిరోధించి రైతులకు అందజేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ బొమ్మ నుంచి నెల్లూరులోని కలెక్టరేట్ వరకు వైసిపి నేతలు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద కాకాని మీడియాతో మాట్లాడుతూ, రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది.