నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య చేసేందుకు రౌడీ షీటర్లు కుట్రలు చేసిన వీడియో బయటపడింది. దీనిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్పందించారు. వైసీపీ హయాంలో జరిగిన రౌడీ షీటర్ల ఆగడాలు, కుట్రలు, కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పట్లో వైసీపీని వీడినందుకు హత్య చేసేందుకే కుట్ర చేశారంటే రౌడీయిజం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందన్నారు. వరుసగా వెలుగుజూస్తున్న ఘటనలు ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరుకు మాయనిమచ్చగా మారాయనీ శుక్రవారం సాయంత్రం 6:00 గంటలకు అయన మాట్లాడారు