జగిత్యాల పట్టణంలోని శ్రీరాం నగర్ లోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని అందిన సమాచారం మేరకు జగిత్యాల పట్టణ సబ్ -ఇన్స్పెక్టర్ M. సుప్రియ తన సిబ్బందితోపాటు వెళ్లి పేకాట ఆడుతున్న 5 గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 40 వేల 540/-రూపాయల నగదు స్వాధీనం చేసుకుని పేకాట రాయుళ్ళను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పీ.కరుణాకర్ బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.