పెదబయలు మండలం లో జామిగుడ, గిన్నెలు కోట, బొంగరం, లింగేటి, కుంతుర్ల , గోమంగి పంచాయతీ పరిధిలో గ్రామస్థులు ఆదివారం సమావేశమై గంజాయి సాగు, రవాణాకు వ్యతిరేఖంగా తీర్మానం చేసారు. ఈసందర్బంగా సమావేశమైన గంజాయి రవాణా, సాగు, పైలెటింగ్ చేయడం వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తీర్మానం చేశారు. ఈ సందర్బంగా పలువురు సర్పంచిలు మాట్లాడుతూ గంజాయి వల్ల మన ప్రాంతంలో ఒక కుటుంబం కూడా బాగు పడింది లేదని అన్నారు