ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ తిరుమల దేవి పర్యవేక్షణలో 262 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అన్ని అవయవాలలో నేత్రాలు ప్రధానం కాబట్టి ప్రతి ఒక్కరూ కండ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. కంటి చూపుకు ఆకుకూరలు కూరగాయలు ఆహారం తీసుకోవాలన్నారు. కండ్లల్లో దుమ్ము ధూళి పడకుండా చూసుకోవాలని జాగ్రత్తగా కాపాడుకోవాలని.