వర్షాకాలం లో వ్యాప్తి చెందు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాల్మీకిపురం మండలం చింతపర్తి పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ జులేఖ బేగం అన్నారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా శనివారం డాక్టర్ జులేఖ బేగం ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ విద్యార్థులు కు సీజనల్ వ్యాధులపై వర్షాకాలం లో పరిశుభ్రత పాటించడం పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా చేతులు, పాదాలు, ఇల్లు, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కలుషితమైన నీటిని, ఆహారాన్ని నివారించి, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి జబ్బుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.