గజపతినగరం మండలంలోని పాత బగ్గాం గ్రామంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో రగిలిపోతున్న పసుపు రెడ్డి చంటి తన అన్న శ్రీను ను చంపాలని ఉద్దేశంతో కత్తితో పొడిచాడు. కొనఊపిరితో ఉన్న అన్న శ్రీనును కుటుంబీకులు గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే శ్రీను మృతి చెందాడు. ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. అందిన ఫిర్యాదు మేరకు గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.