భీమవరం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనంద ఫంక్షన్ హాల్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో సారథ్యం యాత్ర శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అంబేడ్కర్ సెంటర్లో సారథ్యం యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.