ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోను టిడిపి అమలు చేయకుండా సూపర్ చీటింగ్ కు పాల్పడుతోంది అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. నగరంలోని రెండో రోడ్ లో ఉన్న వైసిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు పేజీల మేనిఫెస్టోను ఒకసారి గుర్తు చేసుకోవాలని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ లో అమలు చేసినట్లు చెబుతున్న హామీల్లో సైతం మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు.