అనంతపురంలో ఈ నెల 10న జరగనున్న 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' భారీ బహిరంగ సభపై తాడిపత్రిలో టిడిపి ఎమ్మెల్యేలు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు ఏరా ప్రతాపరెడ్డి కలిసి కూటమి నాయకులతో ముచ్చటించారు. నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.