బంజారా హిల్స్లోని ఎన్బిటి నగర్ లో మహిళా భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క బుధవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. మహిళల శక్తితో రాష్ట్రం ముందుకు సాగుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ప్రయాణం బీమా సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు అంగన్వాడీ టీచర్లకు సదుపాయాలు మహిళా భవనం అంగన్వాడి భవన నిర్మాణాలు కూడా ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.