తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు 108 నూతన వాహనాన్ని సోమవారం రాత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఈ సందర్భంగా 108 వాహనాలు కొరత లేకుండా చూస్తామని ఏరియా ఆసుపత్రి సిబ్బందికి హామీ ఇచ్చారు, అలాగే ఆస్పత్రి సకల సౌకర్యాలతో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపురేఖలు మారాయని పట్టణ ప్రజలు ఏరియా ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా బొజ్జల శ్రీ రెడ్డి తెలిపారు ఏరియా ఆసుపత్రిలో ఏమైనా లోపాలు ఉంటే తనకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు, నూతన 108 వాహనాన్ని ప్రారంభించినందుకు ఆసుపత్రి సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు