నరసన్నపేట: చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీఐజీ నరసన్నపేట మండలం మడపాం జాతీయ టోల్‌గేట్ వద్ద ఉన్న చెక్‌పోస్ట్‌ను డీఐజీ విశాల్ గున్ని ఆకస్మికంగా పరిశీలించారు. సోమవారం సాయంత్రం సీఎం జగన్ పర్యటన ఈనెల 24న ఉండటంతో సంబంధిత భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన విచ్చేశారు. చెక్‌పోస్ట్ వివరాలపై ఆయన ఆరా తీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక, డీఎస్పీలు బాలచంద్రారెడ్డి, శ్రుతి, సీఐ ప్రసాద్ రావు ఉన్నారు.