ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం 649 పొగకు బేళ్లను కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు 1141 పొగాకు బేళ్లు తీసుకురాగా వివిధ కారణాలతో అధికారులు 491 పొగాకు బేళ్లు తిరస్కరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో నిర్ణయత సమయం దాటిన పొగకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పొలంలో మొత్తం 15 కంపెనీలకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారని వేలం నిర్వహణ అధికారి తెలిపారు.