పెద్దపల్లి మున్సిపల్ కార్మికుల అధ్యక్షులు ఆరేపల్లి చంద్రయ్య మరణం తీరనిలోటని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావ్ అన్నారు చంద్రయ్య సంతాప సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు 13 సంవత్సరాలుగా పెద్దపల్లి మున్సిపల్ యూనియన్ నాయకులుగా ఉంటూ ఉద్యమాల్లో పాల్గొని మున్సిపల్ కార్మికుల హక్కులు సౌకర్యాలు సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు మరువలేని అన్నారు ఆయన అడుగుజాడల్లో కార్మికులందరూ పట్టుదలతో ముందడుగు వేస్తూ తమ హక్కులను సాధించుకునేలా ముందుకెళ్లాలని తెలిపారు