యాదాద్రి భువనగిరి జిల్లా:బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ స్వాగతిస్తున్నట్లు ఆయన ఆదివారం తెలిపారు. ఆదివారం ఆయన మోత్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ రాజు చట్టాన్ని సవరించి 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించడం బీసీ సమాజానికి గర్వకారణమన్నారు .మంత్రి వర్గంలో కూడా బీసీలకు అత్యధిక స్థానాలు ఇవ్వాలన్నారు.