ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల నేపథ్యంలో ఇటీవల గోదావరి నదికి వరద పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయినవిల్లి మండలం పరిధిలోని వీరవల్లిపాలెంలో వరద నీరు కొబ్బరి తోటలలోకి చేరడంతో రైతులు కొబ్బరి ఉత్పత్తులను తరలించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నడుము లోతు నీటిలో దిగి కొబ్బరికాయలను ఒడ్డుకు చేర్చుకున్నారు.