తిరుపతిలో నూతన ఆటో స్టాండ్ ను ఆటో యూనియన్ నాయకులు గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతన్ జయచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఇవ్వగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను ఆటో కార్మికులకు వర్తింపచేయాలని అన్నారు లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం కింద 25వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలని డిమాండ్ చేశారు హామీలు అమలు కాకపోతే పోరాటాలకు తాము సిద్ధమన్నారు.