కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరు వద్ద పెన్నా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రం తెల్చిన వివరాలు మేరకు ఎగువున కురుస్తున్న భారీ వర్షాల వల్ల నేడు శనివారం 27 వేల క్యూసెక్కుల వరద నీరు పెన్నా నది ద్వారా సోమశిల జలాశయంలోకి వెళ్తున్నది. కుందునది ద్వారా వస్తున్న వరద నీరు ఆదినిమ్మాయిపల్లి పెన్నానది ఆనకట్ట సమీపంలో చేరుతోంది. శ్రీశైలం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వస్తున్న వరద నీటితోపాటు మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి నీటిని విడుదల చేయడంతో చెన్నూరు వద్ద పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుంది.