పులివెందుల పట్టణం లోని స్థానిక నగరిగుట్ట వివేకానంద స్కూల్ వద్ద గజానన గణేష్ కమిటీ వారు ఏర్పాటుచేసిన పర్యావరణ గణేశుడు ఐదు రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకున్న అనంతరం నేడు నిమజ్జనానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లడ్డు వేలంపాట నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్ లో ఉండే పోచం రెడ్డి సందీప్ రెడ్డి విగ్రహాం ఖర్చు లక్ష పదివేల రూపాయలు సమకూర్చారని ఆయనకు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. లడ్డు వేలం పాటలో పాల్గొన్న జాస్మిన్ భాను లక్ష ఆరువేల రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు.