జైనూరు మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ధర్నా నిర్వహించారు. 20 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఆపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాలా మండిపడ్డారు. కార్మికుల ధర్నాకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, వారి సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుతామన్నారు