అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, చిన్న ఓరంపాడు వద్ద ఆరుగురి ప్రాణాలు తీసిన తమిళనాడుకు చెందిన సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ మహదేవ కు రాజంపేట 3వ అదనపు జడ్జి ఎస్. ప్రవీణ్ కుమార్ నాలుగున్నర ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. జూలై 22న రాజంపేట వైపు నుండి సిమెంట్ ట్యాంకర్ తో తమిళనాడుకు చెందిన మహదేవ మద్యం సేవించి చిన్న ఓరంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 6 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 29 మందికి గాయాలు అయ్యాయి. అప్పటి ఓబులవారిపల్లి ఎస్ఐ బి. శ్రీకాంత్ రెడ్డి క్రైమ్ నంబర్ 166/2023 కింద U/s 337, 304(a), 304(ii) IPC నమోదు చేశారు.