వెదురుకుప్పం మండలం కొమరగుంట పంచాయతీ బందార్లపల్లి గ్రామ సమీపంలో ఓ క్వారీ సిబ్బందికి గ్రామస్తులకు ఇవాళ జరిగిన ఘర్షణలో గ్రామస్థులకు కొందరికి గాయాలయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయింది. ఆదివారం వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ క్వారీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామస్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.