నంద్యాల జిల్లా బేతంచెర్లలో విద్యార్థులు బుధవారం భారీ జాతీయ జెండా ప్రదర్శన చేశారు. భారతమాత వేషధారణతో పాటు, అందరిలో దేశభక్తి పెంపొందేలా ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భారతదేశంలో నివసించే అందరూ ఒకటేనని, చిన్నప్పటి నుంచి దేశభక్తి పెంపొందించాలని సదుద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.