గిరిజన పిల్లలందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంత గొప్ప వ్యక్తులు కావాలని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ నాయుడు ఆకాంక్షించారు. సర్వేపల్లి గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు. గిరిజనులతో కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు.