సారవకోట మండల కేంద్రంలో పోలీసులు ఆకస్మిక కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆదివారం ఉదయం నరసన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఎస్సై జి అప్పారావు తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలవేళ గ్రామాలలో అపరిచిత వ్యక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ఈ తనిఖీలలో పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.