🌈సత్యవేడులో యువకుడు మిస్సింగ్ కేసు కథ సుఖాంతం.🌈 👉ఇంటికి చేరుకున్న నీలితొట్టికండిగ వాసి విజయ్.👈 .ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ మెరిట్ జాబితాలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)లో జిల్లాలోని మొదటి ర్యాంకు సాధించిన సత్యవేడు మండలం నీలితొట్టికండిగ గ్రామానికి చెందిన అభ్యర్థి ఎస్ విజయ్ ఎట్టకేలకు బుధవారం ఇంటికి చేరుకున్నారు.కాగా యువకుడు విజయ్ ఇంటి నుంచి సోమవారం వెళ్లారు.తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు దీనిపై మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో యువకుడు అదృశ్యంపై కేసు నమోదు చేశారు.అయితే సర్టిఫికెట్ల కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడంతో మిస్సింగ్ కేసు కథ సుఖాంతమైంది.