క్రీస్తురాజుపురంలో నాలుగు రోజులుగా తాగునీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం వేళ నీళ్లు వదిలినా చాలా సన్నగా వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.