ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నేడు శుక్రవారం రోజున ఉదయం 8 గంటలకు రైతులు ఆందోళన చేపట్టారు. మూడు, నాలుగు రోజులుగా క్యూ లైన్లో ఉన్నప్పటికీ ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వరికి యూరియా వేయకపోవడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. యూరియా ఇవ్వకపోతే తమకు చావు ఒకటే మార్గమని పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.